ప్రధాని మోదీతో సీఎం జగన్ లంచ్

ప్రధాని మోదీతో సీఎం జగన్ లంచ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దేశానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిపారు. నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి ఆయన హాజరయ్యారు. నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెప్టినెంట్‌ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సీఎం జగన్‌ భోజనం చేశారు. ఆ టేబుల్‌పై మోదీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గ్లెహూత్‌, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, మరో ఇద్దరు లెప్టినెంట్‌ గవర్నర్లు కూర్చున్నారు. దాదాపు గంటపాటు సాగిన ఈ లంచ్‌ భేటీలో దేశంలోని అనేకాంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రధానితో సీఎం జగన్‌ కలిసి కూర్చుని భోజనం చేయడం యాదృశ్చికమేమీ కాదు. సీటింగ్‌ దగ్గర నుంచి ప్రధానితో ఎవరెవరు విందులో పాల్గొంటారనేది టేబుళ్లవారీగా ప్రొటోకాల్‌ సిబ్బంది ముందుగానే నిర్ణయిస్తారు. అంతసేపు ప్రధానితో జగన్‌ ఏం చర్చించారనేది ఆసక్తికరంగా మారింది.

 

Tags :