MKOne TeluguTimes-Youtube-Channel

ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ

ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి  జగన్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి విజ్ఞాపన పత్రం అందించారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్‌ షాతో జగన్‌ భేటీ అయ్యారు. అమిత్‌ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.  

 

 

Tags :