వారికి టికెట్ ఇచ్చేది లేదు..సీఎం వైఎస్ జగన్

వారికి టికెట్ ఇచ్చేది లేదు..సీఎం వైఎస్ జగన్

వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా ఇన్‌ఛార్జిలతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పనితీరుపై సర్వే నివేదికను సీఎం జగన్‌ వెల్లడించారు. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు సరైన పనితీరు కనబర్చలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 27 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగు పర్చుకోవాలని ఆదేశించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. పనితీరు మార్చుకోకుంటే టికెట్‌ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. నవంబరులో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని, ఎన్నికలకు 6 నెలల ముందే సీట్లు ఇవ్వని వారి పేర్లు ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.