ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థపన చేశారు.  ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ,  జనసేన రౌడీసేన అని విమర్శించారు.  గత పాలనలో ప్రజలంతా ఇదేం ఖర్మరా అనుకోబట్టే 2019లో దత్తపుత్రుడు, సొంతపుత్రుడిని ప్రజలు ఓడిరచి బైబై చెప్పారని వ్యాఖ్యానించారు. మనం చేసిన ఇంటింటా అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు అండగా నిలిచాయి. అందుకే రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ, మనందరి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు.  చివరికి కుప్పంలోనూ టీడీపీను చిత్తుగా ఓడిరచారు. అందుకే చంద్రబాబు ఇదేం ఖర్మరా బాబు అని తలపట్టుకుని కూర్చుంటే, ఆయన దత్తపుత్రుడు బాబుతో ఇదేం ఖర్మరా అనుకుంటున్నారు.   ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండటం  ఇదేం ఖర్మరా అని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే సరేసరి, లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అని ప్రజల్ని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కుప్పంలో గెలవలేన్న భయం, నిరాశ, నిస్పృహ ఆయనలో కనిపిస్తున్నాయి అని అన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.