వ్యక్తికి రూ.వెయ్యి.. కుటుంబానికి రూ.2 వేలు : వైఎస్ జగన్

వ్యక్తికి రూ.వెయ్యి.. కుటుంబానికి రూ.2 వేలు : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అసని తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసని తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్సీలతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.  అప్రమత్తంగా ఉండాలి, ఇప్పటికే నిదులిచ్చామని తెలిపారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తం అవసరమని తెలిపారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండూడదన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఇవ్వండని అధికారులకు చెప్పారు. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. జనరేటర్లు, జేసీబీలు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 

 

Tags :