కన్యాశుల్కం పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

కన్యాశుల్కం పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

మహాకవి గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఐదు వేల కాపీలను ముద్రించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని శాసనసభలోని సీఎం కార్యాలయంలో భూమన కరుణాకర్‌ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. ఈ కాపీలను విజయనగరంలోని గురజాడ ఇంటికి బహుకరించి, సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు భూమన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జీవీడి కృష్ణమోహన్‌, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

 

Tags :