కాపీ ప్రియులకు శుభవార్త!

కాపీ ప్రియులకు శుభవార్త!

మీరు కాఫీ ప్రియులా? అయితే ఇంకెం. దీర్ఘాయుష్మంతులన్న మాట. రోజూ రెండు లేదా మూడు కప్పుల కాపీ తాగేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. వీరికి హద్రోగ ముప్పూ తక్కువే నని తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన బేకర్‌ హార్ట్‌ అండ్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం సాగించారు. ఇందులో భాగంగా యూకే బయోబ్యాంక్‌ నుంచి 40`69 ఏళ్ల వయసున్న 4,49,563 మంది ఆరోగ్య వివరాలు సేకరించారు. వీరిలో వివిధ రకాల కాఫీలు తాగే అలవాటుకూ గుండె లయ తప్పడం, హృద్రోగం, మరణం వంటి పరిస్థితులకూ మధ్య సంబంధాన్ని పరిశీలించారు. నిత్యం కాఫీ తీసుకునేవారికి గుండే వైఫల్యం ముప్పే తక్కువేనని గుర్తించారు. కెఫీన్‌ లేని ఇన్‌ స్టంట్‌, గ్రౌండ్‌ కాఫీని రోజూ మితంగా తీసుకోవచ్చని, ఆరోగ్యకర్త జీవనశైలిలో దీన్ని చేర్చాలని పరిశోధనకర్త పీటర్‌ కిస్టెలెర్‌ సూచించారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.