అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కోలిన్ లూథర్ ఇక లేరు

అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కోలిన్ లూథర్ ఇక లేరు

అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి తొలి నల్లజాతి జాతీయ భద్రతా సలహాదారు కోలిన్‌ లూథర్‌ పావెల్‌ కన్నుమూశారు. కోవిడ్‌ 19 సంబంధిత సమస్యలతో మరణించినట్లు పావెల్‌ కుటుంబం ప్రకటించింది. పావెల్‌ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసున్నారని వెల్లడిరచారు. అద్బుతమైన, ప్రేమగల భర్త, తండ్రి, తాతను, ఒక గొప్ప అమెరికన్‌ను కోల్పోయామంటూ పావెల్‌ కుటుంబ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయనకు చికిత్స అందించిన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. రిపబ్లికన్‌ రాజకీయవేత్త అయిన పావెల్‌ టాప్‌ మిలిటరీ ఆఫీసర్‌గా పని చేశారు. 2000లో జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ ఆధ్వర్యంలో తొలి ఆఫ్రికన్‌ అమెరికన్‌ విదేశాంగ కార్యదర్శిగా ఘనతను సాధించారు. బుష్‌ పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2001`2005 వరకు బుష్‌ క్యాబినెట్‌లో పని చేసిన పావెల్‌ సెప్టెంబరు 11 ఉగ్రదాడుల తరువాత గందరగోళ పరిస్థితుల నిర్వహణలో కీలక భూమికను నిర్వహించారు.

 

Tags :