సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్త

సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్త

బాంబే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాకు పదోన్నతి కల్పించారు. సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం ప్రతిపాదన చేసింది. సెప్టెంబర్‌ 26వ తేదీన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాంబే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ దత్తను 2020 ఏప్రిల్‌లో నియమించారు. జస్టిస్‌ దత్త 1965లో జన్మించారు. కోల్‌కతా హైకోర్టు మాజీ జస్టిస్‌ సలిల్‌ కుమార్‌ దత్త కుమారుడు ఈయన. 1989 లో కోల్‌కతా వర్సిటీ నుంచి జస్టిస్‌ దీపాంకర్‌ ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేశారు. రాజ్యాంగం, సివిల్‌ అంశాల్లో సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులో ఆయన ప్రాక్టీస్‌ చేశారు. 2006లో కోల్‌కతా హైకోర్టు పర్మినెంట్‌ జడ్జిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.