దాసరి, చిరంజీవి, అమితాబ్, సోనూసుద్, కె.సి.ఆర్‌ పక్కనే నేను : నటుడు ఆలీ

దాసరి, చిరంజీవి, అమితాబ్, సోనూసుద్, కె.సి.ఆర్‌ పక్కనే నేను : నటుడు ఆలీ

అక్టోబర్‌ 10వ తేది నటుడు ఆలీ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలోని  డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులతో పాటు ఆలీ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదానం నిర్వహించి, భారీ కేక్‌ను కట్‌చేసి తమ ఆనందాన్ని తెలియచేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్‌ సభ్యులు ఆర్‌ రాధాకృష్ణ, లడ్డూపాషా, అశోక్‌లు  మాట్లాడుతూ– కోవిడ్‌ టైమ్‌లో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో కూడా మా సభ్యులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని ఎన్నోసార్లు మాకు సాయం చే శారు. మా యూనియన్‌లో 840మంది సభ్యులు ఉంటే  ఆ సభ్యుల్లో ఎవరైనా ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ఆలీగారి దగ్గరనుండి 10,000 రూపాయిల సాయం అందుతుంది. ఇప్పటివరకు ఆయన మాట ఇచ్చినట్లుగానే దాదాపు 100మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయంచేశారు. నిండునూరేళ్లు ఇలానే ఆయన పుట్టినరోజులు చేసుకుంటూ నలుగురికి సాయం చేయాలని మా యూనియన్‌ తరపున ఆ భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాం’’ అన్నారు. జుబేదా ఆలీ మాట్లాడుతూ–‘‘ సినిమా పరిశ్రమలో అందరికంటే ముందు నిద్రలేచి, ఆలస్యంగా ఇంటికి చేరి లేటుగా నిద్రపోయేవారే  డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులు. ఆ సభ్యులు మా ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.

ఆలీ మాట్లాడుతూ– ‘‘ ఈ రోజు నేను 52వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా. ఇంతమంది నా జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేస్తుంటే నాకు మాటలు రావటంలేదు. నేను నా సంపాదనలోనుండి డ్రైవర్స్‌ యూనియన్‌కే కాదు సినిమా పరిశ్రమలోని ఎన్నో యూనియన్‌లకు సాయం చేయటానికి  ఎప్పుడు ముందుంటాను అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ యూనియన్‌ ఆఫీస్‌కి వెళిçతే అక్కడ దాసరి నారాయణరావు, చిరంజీవి, అమితాబచ్చన్, సోనూసుద్‌ కె.సి.ఆర్‌ గార్ల ఫోటోల పక్కన నా ఫోటో కూడా ఉంటుంది. అందుకే డ్రైవర్స్‌ యూనియన్‌ అంటే నాకు ప్రత్యేకాభిమానం’’ అన్నారాయన. ఈ కార్యక్రమంలో ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’ చిత్ర నిర్మాత కొణతాల మోహన్‌ పాల్గొని మాట్లాడుతూ– ఆలీ లాంటి మంచి మనిషితో సినిమా చేయటం నిజంగా నా అదృష్టం’’ అన్నారు. బాబాఆలీ, కరీమ్‌.‘జోష్‌’ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహమ్మద్ అలీ ప్రముఖ హాస్య నటుడు పుట్టినరోజు 

1968 అక్టోబరు 10 (వయస్సు 52) ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా బర్మాను వదలి రాజమండ్రిలో స్థిరపడ్డారు. తండ్రి అబ్దుల్ సుభాన్ (మహమ్మద్ బాషా అని పిలిచేవారు) దర్జీ పని చేసేవాడు.తల్లి జైతున్ బీబీ గృహిణి. ఆలీ చిన్నప్పటి నుంచే చదువు మీద పెద్దగా ఆసక్తి లేకుండా నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. శ్రీపాద జిత్ మోహన్ మిత్రా బృందంలో మిమిక్రీ కళాకారుడిగా, డ్యాన్సులు, ప్రదర్శనలిచ్చేవాడు. మొదట రాజమండ్రిలోని గంటాలమ్మవీధిలో చిన్న పాకలో ఉండేవారు. ఆలీ పెద్దయ్యాక అక్కడినుండి వేరే ప్రాంతానికి మారారు.

సినీరంగ ప్రస్థానం:
ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత దేవుడు మామయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. తిరిగి రాజమండ్రి నుంచి చెన్నై తిరిగి వచ్చేశాడు. ఈ సినిమాలు చూసిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆయన నిర్మిస్తున్న సినిమా కోసం మళ్లీ చెన్నైకి పిలిపించాడు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా ఆయన రూపొందిస్తున్న సీతాకోక చిలుక చిత్రం కోసం బాలనటుల కోసం చూస్తున్నాడని తెలిసి పరీక్ష కోసమని చెన్నైలో భారతీరాజా కార్యాలయానికి వెళ్ళాడు. ఆలీ ప్రతిభకు మెచ్చిన ఆయన తన చిత్రంద్వారా అవకాశం కల్పించాడు. ఈ సినిమా ఆలీకి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత బాల నటుడిగా కొన్ని చిత్రాలలో నటించాడు. ప్రేమఖైదీ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తో పాటు ఆలీ కూడా మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎంద చాట అంటూ అలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత ఇలాంటి సంభాషణలే పలు సినిమాల్లో వాడుకున్నారు. అటు పిమ్మట యమలీల చిత్రంద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు. అడపా దడపా కథానాయక పాత్రలను పోషిస్తున్నా మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇస్తున్నాడు.
ఇప్పటి వరకు సుమారు 1100 పైగా చిత్రాలలో నటించాడు.

నటించిన కొన్ని  చిత్రాలు:
సీతాకోక చిలుక (1981)
రాజేంద్రుడు గజేంద్రుడు (1993)
మాయలోడు (1993)
అమ్మాయి కాపురం (1994)
ఆలీబాబా అరడజను దొంగలు (1994)
హలో బ్రదర్ (1994)
యమలీల (1994)
ముద్దుల ప్రియుడు (1994)
ఘటోత్కచుడు (1995)
సాహసవీరుడు - సాగరకన్య (1996)
తొలిప్రేమ (1998)
తమ్ముడు (1999)
పాపే నా ప్రాణం (2000)
ఖుషి (2001)
అందాల ఓ చిలకా (2001)
ప్రేమసందడి (2001)
దేవీ పుత్రుడు (2001)
ఆది (2002)
ఇడియట్ (2002)
శివమణి (2003)
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
ఐతే ఏంటి (2004)
ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
శివ్ శంకర్ (2004)
143 (2004)
సూపర్ (2005)
పోకిరి (2006)
పెళ్ళైన కొత్తలో (2006)
ఖతర్నాక్ (2006)
దేశముదురు (2007)
యమదొంగ (2007)
చిరుత (2007)
గుండమ్మగారి మనవడు (2007)
కంత్రి (2008)
హీరో (2008)
శౌర్యం (2008)
జల్సా (2008)
కిక్ (2009)
శంఖం (2009)
ఆలస్యం అమృతం (2010)
వీడు తేడా (2011)
గబ్బర్ సింగ్ (2012)
నా ఇష్టం (2012)
అయ్యారే (2012)
అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ (2013)
అత్తారింటికి దారేది (2013)
బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ (2013)
ఒక్కడినే (2013)
యమలీల 2 (2014)
గలాట (2014)
రేసుగుర్రం (2014)
రోమియో (2014)
వినవయ్యా రామయ్యా (2015)
సుప్రీమ్ (2016)
సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (2016)
ఖైదీ నం. 150 (2017)
రోగ్(2017)
రాధ (2017)
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ (2018)
చాణక్య (2019)
90ఎంల్ (2019)
తెలంగాణ దేవుడు (2021)
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి (2021)

వ్యాపార ప్రకటనలు:
ఇతను చర్మవ్యాధుల నివారణకు ఉపయోగించే మన్మోహన్ జాదూ మలాం కు ప్రచారకర్తగా కూడా వ్యవహరించాడు.

టీవీ కార్యక్రమాలు:
1999 లో జెమిని టివి అధినేత కిరణ్ కు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమం ఆలోచన ఆలీ ఇచ్చాడు. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది నటులు, వ్యాఖ్యాతలు తయారయ్యారు. ఈటీవీ తెలుగులో ఆలీ 369, ఆలీ తో జాలీగా, ఆలీ తో సరదాగా మొదలైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

పురస్కారాలు:
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి ఉత్తమ హాస్య నటుడి గా ఫిల్మ్ ఫేర్ పురస్కారం.
సూపర్ (2005) సినిమాకి గాను ఉత్తమ హాస్య నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం.
ప్రముఖ హాస్య నటుడు ఆలీ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ...

 

Tags :