కనులపండువగా కామన్‌వెల్త్‌... ముగింపు వేడుకలు

కనులపండువగా కామన్‌వెల్త్‌... ముగింపు వేడుకలు

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడలకు తెరపడింది. ఇక ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.  ప్రధాన క్రీడా ప్రాంగణం అలెగ్జాండర్‌ స్టేడియంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను కనువిందు చేశాయి ప్రముఖ పాప్‌ సింగర్లు, నృత్య కళాకారులు నిర్వహించిన కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. మరోవైపు ఈ వేడుకలను పంజాబ్‌ భాంగ్రా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదే సమయంలో వివిధ దేశాలకు  క్రీడాకారులు మార్చ్‌ పాస్ట్‌లో పాల్గొన్నారు. భారత్‌ బృందానికి స్టార్‌ బ్యాక్సర్‌ తెలుగుతేజం నిఖత్‌ జరీన్‌, టిటి స్టార్‌ శరత్‌ కమల్‌ సారథ్యం వహించారు. జులై 28న ప్రాంరభమైన కామన్వెల్త్‌ క్రీడలు   సోమవారం అర్థరాత్రి ముగిశాయి. ఈ మహా సంగ్రామంలో దాదాపు 72 దేశాలు పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలువగా ఇంగ్లండ్‌, కెనడా తర్వాత స్థానాల్లో నిలిచాయి. భారత్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

 

Tags :