ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ... క్రెడాయ్ ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 నుంచి భూములు, స్థలాల మార్కెట్ విలువ పెంచాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కెడ్రాయ్ అధ్యక్షుడు డి. రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే భవన నిర్మాణ రంగంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. కరోనా ఆ తర్వాత పరిణామాల వల్ల మరిన్ని ఇబ్బందులు పడుతున్నాం. నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయి కార్మికులు వలస వెళ్లిపోయారు. ఎన్నో సమస్యలతో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. నేటికీ నిర్మాణాలు కొనసాగించే సాధారణ పరిస్థితికి చేరుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి భూములు, స్థలాల మార్కెట్ విలువ పెంచడం సరికాదు. దీని వల్ల నిర్మాణ రంగంపై అదనపు భారం పడుతుంది. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మార్కెట్ విలువను పెంచకుండా నిర్మాణ రంగానికి, రియల్‌ఎస్టేట్ రంగానికి ఊతం ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భూములు మార్కెట్ విలువ పెంపుదల వాయిదా వేయాలని కోరుతున్నాం అని క్రెడాయ్ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.