అట్లాంటాలో పీవీ విగ్రహ ప్రతిష్టాపన ఫై సమావేశం

అట్లాంటాలో పీవీ విగ్రహ ప్రతిష్టాపన ఫై  సమావేశం

పాల్గొన్న చైర్మన్ కేశవరావు మరియు పీవీ కమిటీ సభ్యులు.

అమెరికన్ ఇండియన్ అసోసియేషన్ తరపున పాల్గొన్న Dr పాడి శర్మ.

అమెరికాలోని అట్లాంటాలో దివంగ‌త మాజీ ప్ర‌ధాని పి.వి.న‌ర‌సింహారావు విగ్ర‌హం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే, ఈరోజు పీవీ కమిటి చైర్మన్ కే కేశవరావు గారి అధ్యక్షతన ఈ సమావేశములో పీవీ కమిటి సభ్యులు పీవీ ప్రభాకర్, మహేష్ బిగాల, చంద్ర శేఖర్ మరియు అమెరికా ప్రతినిధులు Dr పాడీ శర్మ పాల్గొన్నారు.

ఈ సమావేశములో విగ్రహాన్ని ఇండియా నుంచి తరలించడం, తేదీ వివరాలు, కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించడం జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమానికి అట్లాంటా లో మార్టిన్ లూథర్ కింగ్ (MLK) కుటుంబ సభ్యులు, గాంధీ statue ఫౌండేషన్ ప్రతినిధులను, లోకల్ సెనేటర్స్ ని, అమెరికా వ్యాప్తంగా వున్నా పీవీ అభిమానులను పిలుస్తునట్టు తెలిపారు. అలాగే తెలంగాణ నుంచి ప్రముఖుల్ని, పీవీ కుటుంబ సభ్యుల‌ను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, మిగితా దేశాలలో విగ్రహ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో చర్చించి నిర్యాయం తీసుకుంటామని సమావేశములో కేశవరావు తెలిపారు.

 

Tags :