MKOne TeluguTimes-Youtube-Channel

మేం అధికారంలోకి వచ్చాక... నీ సంగతి చెప్పాం

మేం అధికారంలోకి వచ్చాక...  నీ సంగతి చెప్పాం

కర్ణాటక డీజీపీ అధికార బీజేపీకి కొమ్ము కాస్తుండటంపై  ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేవారు.  ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీజీపీ బీజేపీ నేతలకు రక్షకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ పనికిమాలిన వాడు. అతనిపై తక్షణమే కేసు నమోదు చేయాలి. అరెస్టు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్‌ ఈ డీజీపీని తొలగించాలి అని అన్నారు. డీజీపీగా ఆయన మూడేంండ్ల సర్వీస్‌ ముగిసింది. ఇంకెన్నాళ్లు పదవిలో ఉంటాడు. కేవలం కాంగ్రెస్‌ నేతలపై మాత్రమే ఆయన కేసులు నమోదు చేస్తున్నాడు. ఇప్పటికే మాపై 25కు పైగా కేసులు నమోదు చేశాడు అని మండిపడ్డారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాబోతున్నామని, అప్పుడు ఆయనపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా 2023 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

 

 

Tags :