మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు.. కానీ

మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు.. కానీ

మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు, కానీ ఇప్పుడే చెప్పనని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ నుంచి తనను కూడా వెళ్లగొట్టేందుకు చూస్తున్నారని అన్నారు. దాసోజు శ్రవణ్‌ లాంటి మేధావిని పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు. తనను కూడా పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ వాళ్లని బయటకు పంపించి టీడీపీ వాళ్లని తీసుకొచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎవరైనా పీసీసీ అధ్యక్షుడి పక్కన ఉన్నారా? అని ప్రశ్నించారు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా కార్యక్రమ నిర్ణయం ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. చెరుకు సుధాకర్‌ పార్టీలో చేరే విషయం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. సోనియా, రాహుల్‌ గాంధీ దగ్గరే వీళ్ల సంగతి తేల్చుకుంటానని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులన్నారు.

 

Tags :