ప్రధాని మోదీకి రౌడీషీటర్ స్వాగతం

ఇటీవల కర్ణాటకలోని మండ్యలో జరిగిన విజయసంకల్ప యాత్రకు వచ్చిన ప్రధాని మోదీకి రౌడీషీటర్ రవి (ఫైటర్ రవి) స్వాగతం పలికారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది బీజేపీకి జాతీయస్థాయిలో ఇబ్బందికర పరిస్థితి స్ఫష్టించింది. కాంగ్రెస్, జేడీఎస్ దీన్ని ప్రధానస్త్రంగా మలచుకునే అవకశాలు కనిపిస్తుంండటంతో ప్రధాని కార్యాలయం (పీఎంవో) నష్టనివారణ చర్యలు చేపట్టింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర బీజేపీ నేతలను పీఎంవో ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, స్వాగతం పలికేందుకు వచ్చినవారిలో రౌడీషీటర్ ఉన్న సంగతి ప్రధానికి తెలియదని, ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమని రాష్ట్ర బీజేపీ వర్గాలు అంటున్నాయి.
Tags :