కాంగ్రెస్ కు మరో షాక్.. దాసోజ్ శ్రవణ్ రాజీనామా

కాంగ్రెస్ కు మరో షాక్.. దాసోజ్ శ్రవణ్ రాజీనామా

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించి రెండు రోజులు గడవకముందే  పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీపీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలగా పీసీసీ వైఖరి పట్ల శ్రవణ్‌ అసంతృప్తిగా ఉన్నారు. పీజీఆర్‌ కుమార్తె విజయరెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆయన అలిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. శ్రవణ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు తెలియగానే ఆ పార్టీ నేతలు కోదండరెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కలిసి దాసోజు ఇంటికి చేరుకున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవద్దంటూ బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

 

Tags :