ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్దమైంది. దీంతో టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా మారుతాయనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. టీఆర్‌ఎస్‌ దూకుడు కళ్లెం వేయాలనుకుంటున్న కాంగ్రెస్‌ ఈ మేరకు 5 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. వరంగల్‌, నల్గొండ, నిజామాబాద్‌, ఖమ్మం, మెదక్‌ స్థానాల నుంచి పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనుంది. ఖమ్మం నుంచి రాయల నాగేశ్వరరావు, మెదక్‌ నుంచి తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, నల్గొండ నుంచి జిన్నారం శ్రీనివాసరెడ్డిలను బరిలోకి దిగాలని సూచించినట్టు సమాచారం. ఈ మేరకు వీరు నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలున్నాయి. నిజామాబాద్‌, వరంగల్‌ స్థానాల్లో పోటీ చేయించాలని భావించిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌, వేం వాసుదేవరెడ్డిల అభ్యర్థిత్వాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

 

Tags :