రాజీవ్ హత్య కేసు దోషుల విడుదలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం.. సుప్రీం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ..

రాజీవ్ హత్య కేసు దోషుల విడుదలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం.. సుప్రీం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ..

భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేస్తూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు వేలూరు జైలు నుంచి రాజీవ్ హత్య కేసులో దోషులను పోలీసులు విడుదల చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ విషయంలో గాంధీ కుటుంబం ఇప్పటి వరకు పెదవి విప్పకున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. మాజీ ప్రధాని హత్య కేసులో దోషులకు శిక్ష తగ్గించి వారిని విడుదల చేయడం అత్యంత విచారకరమని, ఈ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం ఒకసారి పునఃపరిశీలించుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోగా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో తన రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయనుంది. ఈ విషయంలో సుప్రీం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రివ్యూ పిటిషన్‌ను కూడా దాఖలు చేయడం గమనార్హం.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.