టెక్సాస్ వైద్యుల అరుదైన ఘనత

అమెరికాలో టెక్సాస్‌లోని ఓ ఆస్పత్రిలో అవిభక్త కవలలను శస్త్ర చికిత్సానంతరం విజయవంతంగా విడదీశారు. 16 వారాల వయసునున్న కలలను విడదీసేందుకు వైద్యులు దాదాపు 11 గంటల పాటు కష్టపడ్డారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌కు చెందిన అవిభక్త కవలలు అమీలిన్ రోజ, జమీలిన్ రేలను విడదీసేందుకు చేసిన తమ వైద్యులు చేసిన కృషి ఫలించిందని కుక్ చిల్డ్రన్స్ మెడికల్ సెంటర్ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నారు. ఈ నెల 23న జరిగిన శస్త్ర చికిత్సలలో 6గురు సర్జన్లతో సహా 25 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారు. శస్త్ర చికిత్సానంతరం కవలలైన బాలికలు కోలుకుంటున్నాట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Tags :