నీపిడ్‌(NIEPID) కు చేయూతనందించిన ఫినోమ్‌ (Phenom)

నీపిడ్‌(NIEPID) కు చేయూతనందించిన ఫినోమ్‌ (Phenom)

హెచ్‌టెక్‌ కంపెనీ ఫినోమ్‌, మేధోపరమైన వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు తగిన శిక్షణ అందించడంతో పాటుగా వారి అభ్యున్నతికి తగిన పరిశోధన, సేవలనందిస్తోన్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ద ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజేబిలిటీ (దివ్యాంగులు) (నీపిడ్‌– గతంలో నిమ్హ్‌గా సుపరిచితం)కి అవసరమైన చేయూతనందించింది. 

భారత ప్రభుత్వ సామాజిక  న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారిత శాఖ కింద నీపిడ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఐటీ పరిశ్రమలో కోట్లాది మందికి సరైన ఉద్యోగం పొందేందుకు మాత్రమే కాకుండా రిక్రూటర్లుకు సైతం ప్రతిభావంతులను ఎంచుకునేందుకు సహాయపడుతున్న సంస్థ ఫినోమ్‌. గత దశాబ్ద కాలంలో  ఏఐ శక్తివంతమైన ఈ సంస్ధ 1500కు పైగా ఉద్యోగులతో 400కు పైగా వినియోగదారులకు అంతర్జాతీయంగా సేవలనందిస్తుంది. తెలంగాణా, ఏపీలలోనే ఈ సంస్థకు 1000మందికి పైగా ఉద్యోగులున్నారు. అర్హులైన అభ్యర్ధులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు, అవసరార్ధులకు తగిన సేవలనందించడంలోనూ ముందుండే సంస్థ ఫినోమ్‌. ఈ సంస్థ ఇప్పుడు నీపిడ్‌ అభ్యర్థన మేరకు దాదాపు 27లక్షల రూపాయలకు పైగా విలువైన సహాయాన్ని అందించింది.

మేథోపరమైన వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు మరీ ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 100 మంది చిన్నారులకు తగిన శిక్షణ అందించేలా  కృషి చేస్తోన్న టీచర్లు, టీచర్‌ అసిస్టెంట్లకు సహాయపడేందుకు 15 లక్షల రూపాయలను  విరాళంగా అందించడంతో పాటుగా  పాఠశాలకు వచ్చే వీలు లేని చిన్నారుల ఇంటి వద్దకే వెళ్లి తగిన శిక్షణ ఇచ్చేలా టీచర్లను ప్రోత్సహిస్తూ 6 లక్షల రూపాయల విలువైన మారుతీ వ్యాన్‌ ; చిన్నారులకు శిక్షణ అందించేందుకు 6 లక్షల రూపాయల విలువైన టీఎల్‌ఎం కిట్లను అందజేసింది.

ఈ  విరాళాలను అందజేయడం కోసం ఆగస్టు 10వ తేదీన  సికింద్రాబాద్‌లోని  మనోవికాస్‌ నగర్‌లో ఉన్న నీపిడ్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఫీనోమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీ నాంచారయ్య తో పాటుగా ఫినోమ్‌ సీఈఓ  మహీ బైరెడ్డి ; ఫీనోమ్‌ సీనియర్‌  వైస్‌ ప్రెసిడెంట్‌ –ఇంజినీరింగ్‌  శివానంద్‌ ఆకెళ్ల; నీపిడ్‌ డైరెక్టర్‌ బీవీ రామ్‌కుమార్‌ ; నీపిడ్‌ ప్రిన్సిపాల్‌ గణేష్‌ షెరెగర్‌  తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో  భాగంగా దివ్యాంగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఆహుతులను రంజింపజేశారు. అనంతరం చెక్కులను, వాహన తాళాలను ఫినోమ్‌ తరపున నిర్వాహక బృందం నీపిడ్‌  బృందానికి అందజేశారు.

 

Tags :