MKOne Telugu Times Business Excellence Awards

సంబరంలో సేవ.. సంబరంతో సేవ : శ్రీధర్ అప్పసాని

సంబరంలో సేవ.. సంబరంతో సేవ : శ్రీధర్ అప్పసాని

అమెరికా తెలుగు సంఘాల చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా నాట్స్ సంబరంలో  సేవ.. సంబరంతో సేవ అనే ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని తెలిపారు. సంబరాలకు వచ్చే విరాళాల్లో 25 శాతం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తామని, పేదలు, అభాగ్యుల కోసం పని చేసే సేవా సంస్థలకు ఇస్తామని శ్రీధర్ అప్పసాని ప్రకటించారు. సంబరాలు అంటే కేవలం ఆట, పాటలు మాత్రమే కాదు.. సంబరాలతో సేవ కూడా చేయవచ్చని నాట్స్ నిరూపిస్తుందన్నారు. 

సంబరాల సంతోషాన్ని పంచడంతో పాటు సేవే గమ్యం అనే నాట్స్ నినాదాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్న సంస్థ నాట్స్ అనేది సంబరాలతో మరోసారి రుజువు కాబోతుందని శ్రీధర్ అప్పసాని తెలిపారు. నాట్స్ సంబరాల కోసం సంబరాల కమిటీ చేస్తున్న అవిశ్రాంత కృషిని నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిండెంట్ బాపయ్య చౌదరి( బాపు) నూతి అభినందించారు. 

సంబరంతో సేవను కూడా మిళితం చేసిన సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసానిపై నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు ప్రశంసల వర్షం కురిపించారు.

సంబరాల సందర్భంగా జరిగిన టెన్నిస్, వాలీబాల్ విజేతలకు ట్రోఫీలను, నగదు పురస్కారాలను అందచేయనున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన తెలుగమ్మాయి పోటీల్లో మూడు విభాగాల్లో(ముద్దుగుమ్మ, కావ్య నాయకి, కిన్నెరసాని) ఫైనల్స్ కు చేరుకున్న 15 మంది  తెలుగమ్మాయిల మధ్య జరిగే ఆసక్తికర పోటీ కి సర్వం సిద్ధమయ్యిందని ఈవెంట్ జాతీయ కోఆర్డినేటర్ కవిత తోటకూర తెలియచేసారు.

 

Tags :