ఏపీలో భారీగా నమోదైన కేసులు..

ఏపీలో భారీగా నమోదైన కేసులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,954 పరీక్షలు నిర్వహించగా, 3,205 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,87,879కి చేరాయి. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 14,505గా ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 281 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,255 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,119 యాక్టివ్‌ కేసులు నమోదైయ్యాయి.

 

Tags :