ఏపీలో కరోనా విజృంభణ.. భారీగా పెరిగిన కేసులు

ఏపీలో కరోనా విజృంభణ..  భారీగా పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొసాగుతుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,884 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 4,348 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా బారి నుంచి 262 వంది పూర్తి కోలుకున్నారు. కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,204 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,92,227 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,507 మరణాలు సంభవించాయి. కరోనా నుంచి 20,63,516 మంది రికవరీ చెందారు.

 

Tags :