దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 12,72,073 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 1,09,345 మంది కోవిడ్‌ నుంచి  కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే గతవారంతో పోలిస్తే 6.7 శాతం కోవిడ్‌ కేసులు అధికంగా పెరిగాయి. దేశంలో 14.78 శాతానికి పాజిటివ్‌ రేటు చేరింది.  మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 5,753 చేరింది.

 

Tags :