అమెరికా మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఔషధం

అమెరికా మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఔషధం

అమెరికా మార్కెట్‌లో త్వరలో అత్యంత ఖరీదైన ఔషధం విడుదల కానుంది. సీఎస్‌ఎల్‌ బెప్‌ారింగ్‌ అనే కంపెనీ హెమ్‌జెనిక్స్‌ పేరుతో ఈ జన్యు ఔషదాన్ని విడుదల చేయనుంది. తరచూ రక్తస్రావంతో బాధపడే హిమోఫోలియో-బి రోగుల పాలిట ఈ ఔషధం వరంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ ఔషధం డోసు ధర 35 లక్షల డాలర్లు. ప్రస్తుతం డాలర్‌` రూపాయి మారకం ప్రకారం చూస్తే ఇది దాదాపు 28.7 కోట్లకు సమానం. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఇటీవలే ఈ ఔషధానికి ఆమోదం తెలిపింది. హెమ్‌జెనిక్స్‌ వినియోగంతో అరుదైన హిమోఫోలియో బి వ్యాధితో సతమతమయ్యే రోగుల్లో రక్తస్రావాల సంఖ్య 54 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.