MKOne Telugu Times Youtube Channel

గుజరాత్ సీఎం అభ్యర్థిగా అమిత్ షా ?

గుజరాత్ సీఎం అభ్యర్థిగా అమిత్  షా ?

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సోషల్‌ మీడియా వేదికగా ఒక సెటైర్‌ సంధించింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా కేంద్ర హోమ్‌ శాఖ మంత్రిని ఖరారు చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయన్న ఆప్‌. ఈ వార్త నిజమేనా అని తన ట్వీట్‌లో బీజేపీని ప్రశ్నించింది. ప్రస్తుతం గుజరాత్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న భూపేంద్ర పటేల్‌ నాయకత్వంపై బీజేపీ అసంతృప్తిగా ఉందని తెలుస్తోందని ఆప్‌ పేర్కొంటూ, ఈ మాట కూడా నిజమేనా అని భూపేంద్రను ప్రశ్నించింది. మరొక అడుగు ముందుకు వేసిన ఆప్‌ గుజరాత్‌లో నానాటికీ బలోపేతమవుతున్న తమను చూసి బీజేపీ భయపడుతోందని కూడా వ్యాఖ్యానించింది. మొత్తంగా తమ దినదినాభివృద్ధిని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక బీజేపీ తలపట్టుకుందుని ఆప్‌ కామెంట్‌ చేసింది.

 

Tags :