గుడ్ న్యూస్.. త్వరలో పిల్లలకు

గుడ్ న్యూస్.. త్వరలో పిల్లలకు

కరోనా బారి నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2-18 ఏళ్ల వారికి కొవాగ్జిన్‌ టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి సిఫారస్సులు చేసింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే 18 ఏళ్ల వయసులోపు పిల్లలపై రెండు, మూడో దశల ట్రయల్స్‌ కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించిన డేటాను ఇప్పటికే డ్రగ్స్‌ అండ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి సమర్పించింది. కేంద్రం అనుమతి లభిస్తే భారత్‌లో పిల్లలకు అందుబాటులో వచ్చే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ ఇదే కానుంది. పిల్లలకు ఇచ్చే కొవాగ్జిన్‌ టీకా కూడా రెండు డోసుల టీకానే. తొలి డోసు ఇచ్చిన 20 రోజులకు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది.

 

Tags :