కరోనా మహమ్మారి విషయంలో.. ఓ గుడ్ న్యూస్

కరోనా మహమ్మారి విషయంలో.. ఓ గుడ్ న్యూస్

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా మహమ్మారి విషయంలో శాస్త్రవేత్తలు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వైరస్‌ తన సంక్రమణ సామర్థ్యాన్ని ఐదు నిమిషాల్లో కోల్పోతున్నట్టు అధ్యయనంలో వెల్లడైనట్టు శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడిరచారు. వైరస్‌ 20 నిమిషాల పాటు గాలిలో ఉంటే దాని సామర్థ్యం 90 శాతం క్షీణిస్తోందని, గాలిలో ఉన్న తొలి 5 నిమిషాల్లోనే సంక్రమణ శక్తిని పెద్దమొత్తంలో కోల్పోతోందని చెప్పారు. ఈ మేరకు యూకేలోని బ్రిస్టల్‌ యూనివర్సిటీకి చెందిన ఏరోసోల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ స్పష్టం చేసింది. అంతేకాదు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా కరోనాకు చెక్‌ పెట్టవచ్చని పేర్కొన్నారు. వెంటిలేషన్‌ సక్రమంగా లేకపోవడం వల్ల కంటే ప్రజలు దగ్గరగా ఉన్నప్పుడే వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్‌ జొనాథన్‌ రీడ్‌ తెలిపారు.

 

Tags :