సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు.. మోదీ, జగన్ ప్రభుత్వాలు

సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు.. మోదీ, జగన్ ప్రభుత్వాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ  తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మిన్నకుండిపోయారని సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో పోత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్‌ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయని అన్నారు. బీజేపీ వైసీపీ అరాచకాలను అరికట్టాలంటే అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి వెళ్లాలని సూచించారు. అప్పుడే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.