ఏడేళ్ల కాలంలో ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు

ఏడేళ్ల కాలంలో ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు

ఏడేళ్ల కాలంలో పెట్రోల్‍, డీజిల్‍ ధరలను వంద రూపాయలు దాటించిన ఏకైక ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. పెట్రోల్‍, డిజిల్‍ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో  ప్రజా బ్యాలెట్‍ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్‍ సంస్కరణలు అమలు చేస్తుంటే ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం వత్తాసు పలుకుతూ విద్యుత్‍ మోటార్లకు మీటర్లు బిగించే కార్చక్రమానికి శ్రీకారం చుడోందన్నారు. పెరిగిన విద్యుత్‍ చార్జీలపై ఈ నెల 9వ తేదీన విజయవాడలో వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించి, భవిష్యత్‍ కార్యచరణ రూపొందిస్తామన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఈ నెల 14వ తేదీ అనంతపురం జిల్లా నుంచి పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. 21వ తేదీ ముగింపు సందర్బంగా విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

 

Tags :