సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.. సీఎం జగన్ పై

సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.. సీఎం జగన్ పై

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని జగన్‌ పదే పదే చెప్పారని, కావాలంటే ఎన్నికల సమయంలో జగన్‌ మాట్లాడిన క్యాసెట్లు బయటకు తీసి చూడాలన్నారు. మద్య నిషేధం అంటే గతంలో ఉన్న బ్రాండ్స్‌ నిషేధించడమా? అని ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిఫెస్టో లో పెట్టిన వాటిని అమలు చేయకపోతే క్రిమినల్‌ యాక్షన్‌  తీసుకోవాలన్నారు. మధ్యపానాన్ని నిషేధిస్తామని అనలేదని జగన్‌ దైవ ప్రమాణం చేస్తే తాము ఇక ఈ అంశంపై మాట్లాడమని అన్నారు. వైసీపీ మ్యానిఫెస్టోని ఆ పార్టీ నేతలే నమ్మడం లేదన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయని, ఆ ఆదాయాన్ని కుదవ పెట్టే స్థాయికి జగన్‌ ప్రభుత్వం పడిపోయిందని ఎద్దవా చేశారు.

 

Tags :