టీఆర్ఎస్, బీజేపీది గల్లీలో కుస్తీ.. ఢిల్లీ లో దోసీ : నారాయణ

టీఆర్ఎస్, బీజేపీది గల్లీలో కుస్తీ.. ఢిల్లీ లో దోసీ : నారాయణ

టీఆర్‍ఎస్‍, బీజేపీది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో  బీజేపీ, టీఆర్‍ఎస్‍ మధ్య అవగాహన ఉందని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 27న భారత్‍ బంద్‍కు పిలుపిస్తున్నట్లు తెలిపారు. ఈ బంద్‍లో టీఆర్‍ఎస్‍, టీడీపీ కూడా పాల్గొనాలని కోరారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు పింఛను ఇవ్వాలని డిమాండ్‍ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్‍ 11 నుంచి 17 వరకు సాయుధ అమరులకు నివాళి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‍ రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో పాల్గొన్న వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‍ చేశారు.

 

Tags :