ఆ విషయం విజయసాయి రెడ్డి ఇప్పటికి గుర్తించారా?

ఆ విషయం విజయసాయి రెడ్డి ఇప్పటికి గుర్తించారా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి అధికారం లేదని ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికి గుర్తించారా? లేక 3 ఏళ్లు నిద్రపోయారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడేళ్ల తదుపరి 3 రాజధానుల విషయంలో రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని రాజ్యాంగ సవరణ కోరుతూ పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్‌ దాఖలు చేయటమేంటి? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించిందన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను నిర్వీర్యం చేయదలచిందన్నారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అమరావతిగా రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. అలాగే పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టాలన్నారు.

 

Tags :