MKOne Telugu Times Youtube Channel

సంబరాల్లో అత్యవసర చికిత్సపై శిక్షణ

సంబరాల్లో అత్యవసర చికిత్సపై శిక్షణ

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సంబరాల్లో వైద్యానికి కూడా ప్రాముఖ్యనిస్తూ, అత్యవసర సమయాల్లో ఏవిధంగా వ్యవహరించాలన్న విషయంపై శిక్షణను ఇవ్వనున్నారు. సిపిఆర్‌ విధానంపై అనుభవశాలులచేత శిక్షణను ఇప్పించనున్నారు. మే 28వ తేదీ ఈ కార్యక్రమం జరగనున్నది. యాక్ట్‌ నౌ అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనలనుకునేవారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. 

 

 

Tags :