శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్' ట్రైలర్ విడుదల

బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం క్రేజీ అంకుల్స్. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహించారు. శ్రీవాస్ 2 క్రియేటివ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. భార్యను మోసం చేస్తే చంపేస్తా ఈ అపార్ట్మెంట్లో ముగ్గురు రాములు ఉన్నారు అన్న మాటలు ఆసక్తిగా మారాయి. అసలు ఆ ముగ్గురు ఆర్ఆర్ఆర్ చేసిన పనేంటి? ఈ మేడమ్ ఎవరు? ఆమె ఎందుకు వారిని అలా అభివర్ణించింది. ఇంతకీ వారి కథ ఏ మలుపు తిరిగింది? వారి వ్యథ తీరిందా? తెలియాంటే సినిమా చూడాల్సిందే. అప్పటివరకూ ఈ క్రేజీ ట్రైలర్ చూసేయండి. ఈ నెల 19న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో భరణి, మనో, పోసాని కృష్ణమూరళి, రాజా రవీంద్ర, కృష్ణ మురళి, గిరిధర్, అదుర్స్, రఘు, హేమ తదితరులు నటించారు.