క్రెడాయ్ టెక్ కాన్ -22 సదస్సు

క్రెడాయ్ టెక్ కాన్ -22 సదస్సు

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌ ) టెక్‌కాన్‌-22 ఫస్ట్‌ ఎడిషన్‌ శంషాబాద్‌లో జరిగింది.  వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి చర్యలపై చర్చించింది. హైదరాబాద్‌లో క్రెడాయ్‌ టెక్‌ కాప్‌ 22 సదస్సును ఏర్పాటు చేసింది. పరిశ్రమలోని కొన్ని కీలక సమస్యలకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అందిపుచ్చుకునే అవసరాన్ని రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ కూడా అర్థం చేసుకుందని క్రెడాయ్‌ ఆఫీసు బేరర్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు క్రెడాయ్‌ నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జి రామ్‌రెడ్డి, నరేంద్ర కుమార్‌ ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. సాంకేతిక పురోగతి భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో విశేష మార్పులను తెచ్చిందన్నారు. దేశంలోని వివిధ క్రెడాయ్‌ చాప్టర్ల నుంచి 200 లకు పైగా డెవలపర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.

 

Tags :