MKOne TeluguTimes-Youtube-Channel

ఎస్ వీబీతో పోలిస్తే భారత్ లో ఎక్కువగానే : జెఫరీస్

ఎస్ వీబీతో పోలిస్తే భారత్ లో ఎక్కువగానే : జెఫరీస్

భారీగా పతమైన క్రెడిట్‌ సూయిజ్‌ ప్రభావం మాత్రం ఎస్‌వీబీతో పోలిస్తే భారత బ్యాంకులపై ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్‌ ఇండియా తెలిపింది. భారత  డెరైవేటివ్‌ మార్కెట్లలో క్రెడిట్‌ సూయిజ్‌ కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు జెఫరీస్‌ విశ్లేషకుడు ప్రఖార్‌ శర్మ తెలిపారు. బ్యాంకు పతనం కావడం వల్ల లభ్యత సమస్య తలెత్తోచ్చని ఆయన అన్నారు. వివిధ కంపెనీలు తమ చెల్లింపులను గడువులోగా పూర్తి చేయపోవచ్చునని వెల్లడించారు. విదేశీ బ్యాంకులు తమ ఆస్తుల్లో 4-6 శాతం మాత్రమే భారత్‌లో కలిగి ఉన్నాయని జెఫరీస్‌ తెలిపింది. అయితే బ్యాలెన్స్‌  షీట్‌ పరిధిలోకి రాని రుణాలు మాత్రం సగం మన దేశంలోనే ఉన్నాయని పేర్కొంది.  జెఫరీస్‌ అంచనాల ప్రకారం భారత్‌లో క్రెడిట్‌ సూయిజ్‌కు 2.4 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. దీంతో దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 12వ అతిపెద్ద విదేశీ బ్యాంకు ఇది. బ్యాంకు మన దేశంలో ఇచ్చిన రుణాల్లో 73 శాతం స్వల్పకాలిక వ్యవధితో కూడినవే. ఈ నేపథ్యంలో ద్రవ్యలభ్యత, నిర్దిష్ట గడువులోగా చేయాల్సిన వివిధ కంపెనీల చెల్లింపులను ఆర్‌బీఐ నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రఖార్‌ శర్మ అన్నారు.

 

 

Tags :