హైదరాబాద్‌లో క్రిటికల్ రివర్ నూతన సెంటర్

హైదరాబాద్‌లో క్రిటికల్ రివర్ నూతన సెంటర్

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అంతర్జాతీయ డిజిటల్‌, టెక్నాలజీ కన్సల్టింగ్‌ సేవల కంపెనీ క్రిటికల్‌రివర్‌ హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ని ప్రారంభించింది. దేశంలో తమ సంస్థకు ఇది మూడో కేంద్రమని కంపెనీ సీఈవో అంజి మారం తెలిపారు. ఇక్కడ 350 మంది పనిచేస్తారని, దేశంలో 550 మంది ఉద్యోగులున్నారని తెలిపారు. రానున్న అయిదేళ్లలో రూ.200 కోట్ల పెట్టుబడి పెడతామని, ఉద్యోగుల సంఖ్య 10 వేలకు చేర్చాలనేది తమ ప్రణాళికగా తెలిపారు. వరంగల్‌కూ విస్తరిస్తామన్నారు. ఈ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. క్రిటికల్‌ రివర్‌ సీఎఫ్‌ఏ చంద్రా చంద్రగిరి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :