సీఎస్ఎస్ శుభవార్త.. వచ్చే ఏడాదిలో భారత్ లో

సీఎస్ఎస్ శుభవార్త.. వచ్చే ఏడాదిలో భారత్ లో

వచ్చే ఏడాదిలో భారత్‌లో ప్రాంగణ నియామకాల ద్వారా 1,300 మందిని నియమించుకోనున్నట్లు సీఎస్‌ఎస్‌ కార్ప్‌ తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో సుమారు 6,000 మంది ఈ సంస్థలో పనిచేస్తున్నారు. అలాగే 2023 చివరికల్లా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే యోచనలోనూ కంపెనీ ఉంది. సాంకేతికత సేవల సంస్థ అయిన సీఎస్‌ఎస్‌ కార్ప్‌ బలమైన వృద్ధిపై ఆశావహ దృక్పథంతో ఈ నియామకాలను చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల సంఖ్య ఇటీవలే 10,000 మైలు రాయిని అధిగమించిందని, ఇందులో అత్యధిక వాటా భారత్‌దేనని సీఎస్‌ఎస్‌ కార్ప్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సునీల్‌ మిత్తల్‌ తెలిపారు. మా ఉద్యోగుల సంఖ్య రెండున్నరేళ్లలోనే రెట్టింపు అయ్యింది. మొత్తం 10,000 మందిలో భారత్‌లోనే 6,000 మంది పనిచేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో ప్రస్తుత సంఖ్యను మళ్లీ రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నామని ఆయన తెలిపారు.

 

Tags :