భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్‌లో భారత క్రీడాకారిణి ప్రియాంక గోస్వామి అద్భుత ప్రదర్శన చేసి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రియాంక 43:38.82లో రేసును పూర్తి చేసింది. పురుషుల 300 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్‌లో అవినాస్ సాబ్లే రజతం సాధించారు. 8:11.20లో రేసు పూర్తి చేసి భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య 28కు చేరింది.
Tags :