MKOne TeluguTimes-Youtube-Channel

తానా కళాశాల ఆధ్వర్యంలో డాక్టర్ హిమబిందు నృత్యప్రదర్శన

తానా కళాశాల ఆధ్వర్యంలో డాక్టర్ హిమబిందు నృత్యప్రదర్శన

తానా కళాశాల ప్రోగ్రాం మంచి విజయం సాధించిందని, దీనిలో అమెరికా వ్యాప్తంగా 500 మందికిపైగా విద్యార్థులు చేరడం గొప్ప విషయమని ఈ కార్యక్రమం చైర్మన్ రాజేష్ అడుసుమల్లి చెప్పారు. గత ఆరేళ్లుగా తానా కళాశాల ప్రోగ్రాం చైర్మన్‌గా సేవలు అందించే భాగ్యం తనకు దక్కనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా కూడా కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడంలో ఎంతో ఆసక్తి చూపుతున్నారని మెచ్చుకున్నారు. అలాగే ఈ క్లాసులు చెప్తున్న గురువులు, విద్యార్థుల తల్లిదండ్రులు లేకపోతే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయ్యేది కాదని చెప్పిన ఆయన.. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం కోసం ఎంతో కష్టపడిన పరమేష్ దేవినేని, రవీంద్ర చిత్తూరికి ధన్యవాదాలు తెలిపారు. కళాశాల ప్రోగ్రాం కో-చైర్మన్ మాలతి నాగభైరవ, వెబ్ సపోర్ట్ చైదరీ ఆలపాటి కూడా ఎంతో మద్దతు ఇచ్చారని మెచ్చుకున్నారు.

ఈ క్రమంలోనే తమ ఆలోచనకు మద్దతుగా నిలిచిన తానా మాజీ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర, వీ చౌదరి జంపాల, సతీష్ వేమన జే తల్లూరి, అంజయ్య చౌదరి లావు తదితరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. కళాశాల రీజనల్ చైర్మన్లు ప్రశాంతి మద్దినేని, శర్మ సారిపల్లి, సునీత కంభాలదిన్నె, వెంకీ గద్దె, విఠల్ అన్నే తదితరులతోపాటు తానా స్థానిక ప్రతినిధుల సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందని కొనియాడారు. కొన్నిరోజుల క్రితం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ప్రముఖ భరతనాట్యం డ్యాన్సర్ డాక్టర్ హిమబిందు ఉప్పరి గారు డల్లాస్ వచ్చి తమ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారని కళాశాల చైర్మన్ తెలిపారు. ఈ క్రమంలోనే డీఎఫ్‌డబ్ల్యూ హిందూ ఆలయంలో ఆమె ప్రదర్శన కూడా ఏర్పాటు చేశామని, తమకు ఈ అవకాశం కల్పించిన పద్మావతి వర్సిటీకి ధన్యవాదాలు తెలిపారు.

 

 

Tags :