యూఎస్ ఓపెన్ విజేత మెద్వెదేవ్

యూఎస్ ఓపెన్ విజేత మెద్వెదేవ్

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌కు 25 ఏళ్ల  రష్యా ఆటగాడు మెద్వెదేవ్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. ప్రపంచ నవంబర్‌వన్‌ జకోపై రెండో సీడ్‌ మెద్వెదేవ్‌ టైటిల్‌ పోరులో 6`4, 6`4,6`4, తేడాతో వరుస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ అందుకున్నాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుదిపోరులో డానిలె మెద్వెదేవ్‌ విజేతగా నిలిచాడు. దీంతో 52 ఏళ్ల తర్వాత క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌, అత్యధిక మేజర్‌ టైటిల్స్‌ సాధించిన ఆటగాడిగా కొత్త చరిత్ర లిఖిద్దామన్న జకోకు నిరాశ తప్పలేదు.

స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరల్‌ మోకాలి గాయం, స్పెయిన్‌బుల్‌ రఫెల్‌ నాదల్‌ కూడా గాయంతో యూఎస్‌ ఓపెన్‌కు దూరమవడంతో 34 ఏళ్ల జకో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా అవతరించనున్నాడని టెన్నిస్‌ ప్రపంచం భావించింది. కానీ వరల్డ్‌ నంబర్‌వన్‌ జకో ఆశ నిరాశగానే మిగిలింది. ప్రస్తుతం జకోవిచ్‌ 20 గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌ సరసన బిగ్‌ త్రీగా కొనసాగుతున్నాడు. కాగా తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ అందుకున్న రోజే మెద్వెదేవ్‌ పెళ్లి రోజు కావడంతో తను శ్రీమతికి ట్రోఫీని వివాహ వార్సికోత్సవ కానుగా అందజేశాడు.

 

Tags :