MKOne TeluguTimes-Youtube-Channel

భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న " క్రాంతి "...!

భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న " క్రాంతి "...!

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ హీరోగా నటించిన సినిమా " క్రాంతి ". రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అందాల భామ రుచిత రామ్ ఈ సినిమాలో దర్శన్ తో జత కట్టింది. మీడియా హౌస్ స్టూడియో బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి వి.హరికృష్ణ దర్శకత్వం వహించారు. సీనియర్ స్టార్ హీరో, హీరోయిన్లు రవిచంద్రన్, సుమలత, సంపత్ రాజ్, తరుణ్ అరోరా తదితరులు ఈ సినిమాలో నటించారు.

రీసెంట్ గా రిలీజైన క్రాంతి సినిమా ప్రేక్షకులని కట్టిపడేసిందనే చెప్పాలి. అవినీతి పరుడైన మంత్రిని, ఒక బిజినెస్ మాగ్నెట్ ఎలా దారిలో పెట్టాడు అనేది ఈ చిత్ర సారాంశం. ఒక పొలిటీషియన్, ఎన్.ఆర్.ఐ మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు, జరిగిన సంఘటనలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. కథా కథనాలతో ఆడియన్స్ దృష్టిని ఈ సినిమా వైపు తిప్పుకున్నారు మేకర్స్. భారీ తారాగణం ఉండడం కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

ఇక క్రాంతి సినిమా వసూళ్ల విషయానికి వస్తే, రీసెంట్ గా రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీ కలెక్షన్స్ ని క్రాస్ చేసే విధంగా కనిపిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. భారీ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. క్రాంతి చిత్రాన్ని సుమారు 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. థియేట్రికల్ బిజినెస్ సుమారు 20 కోట్లు జరుగగా, బ్రేక్ పాయింట్‌ను 21 కోట్లుగా నిర్ణయించారు. దాదాపు 300 స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఇదే స్పీడ్ లో వెళ్తే క్రాంతి సినిమా, కాంతారా కలెక్షన్స్ ని బీట్ చేయం ఖాయమని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

Tags :