రామ్‌చరణ్, శంకర్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ భారీ పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్'... టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం RC15కి `గేమ్ చేంజర్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్రమైజ్డ్‌గా అంచనాలకు ధీటుగా గేమ్ చేంజర్‌ను నిర్మిస్తున్నారు.
రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భగా గేమ్ చేంజర్ టైటిల్ రివీల్ వీడియో, ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా పవర్‌స్టార్ రామ్ చణ్ పాన్ ఇండియా ఇమేజ్‌కు తగ్గ పవర్ఫుల్ టైటిల్‌ను స్టార్ డైరెక్టర్ శంకర్ ఖరారు చేశారు. టైటిల్ రివీల్ అయిన సదరు వీడియో చూస్తే హీరో క్యారెక్టరైజేషన్ లార్జర్ దేన్ లైఫ్‌గా ట్రాన్స్‌ఫర్‌మేటివ్‌గా ఉందని తెలుస్తోంది. ఈరోజునే రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో బైక్ పై కూర్చుని వెనక్కి తిరిగి చూస్తున్న స్టైలిష్ లుక్ లో చరణ్ ఉన్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ కి ఎక్స్ట్రోడినరి రెస్పాన్స్ వస్తుంది.