సంక్రాంతి తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం : కిషన్ రెడ్డి

సంక్రాంతి తర్వాత  కేంద్ర ప్రభుత్వం నిర్ణయం : కిషన్ రెడ్డి

సంక్రాంతి పండుగ తర్వాత పరిస్థితులను బట్టి దేశంలో లాక్‌డౌన్‌ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. గాంధీ ఆస్పత్రిని కేంద్ర మంత్రి సందర్శించారు. కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌ విధింపు, ఆంక్షలు విధించడం తదితర పూర్తి అధికారాలను రాష్ట్రాలకే ఉన్నాయన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌, ఆంక్షలు విధించుకోవచ్చన్నారు. ఇప్పటి వరకైతే  లాక్‌డౌన్‌ ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. త్వరలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడతారని తెలిపారు. దేశంలో కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాలైనా కొవిడ్‌ మెడిసిన్‌, ఎక్విప్‌మెంట్‌ ఎగుమతులు నిలిపివేసినట్లు తెలిపారు.

 

Tags :