సిసోడియాకు ఈడీ కస్టడీ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు

లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను కోర్టులో హాజరు పరిచారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన్ను ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ అధికారుల విజ్ఞప్తిని విన్న కోర్టు.. సిసోడియాను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాను సీబీఐ చేయగా.. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సిసోడియాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సిసోడియాను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును అభ్యర్థించారు. ఈడీ విజ్ఞప్తికి సమ్మతించిన కోర్టు.. సిసోడియాను ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
Tags :