ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం...

ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం...

ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం.  2016 డిసెంబర్‌ 31న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బాధ్యతలు స్వీకరించిన బైజల్‌, దాదాపు ఐదున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో ఘర్షణాత్మక వైఖరితో అనిల్‌ బైజల్‌ పలమార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

 

Tags :