మరో కొత్త రకం కోవిడ్ ఆవిష్కృతం....డెల్టాక్రాన్!

మరో కొత్త రకం కోవిడ్ ఆవిష్కృతం....డెల్టాక్రాన్!

కరోనా వేర్వేరు రూపాలతో మనుష్యులను చుట్టుముడుతోంది. ఇప్పటికే వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతుంటే.. మరొకవైపు కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. సైప్రస్‌లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. దీనికి ‘డెల్టాక్రాన్‌’ అని పేరు పెట్టారు.  ఇందులో డెల్టా వేరియంట్‌ లక్షణాలు, ఒమిక్రాన్‌ లక్షణాలు ఉండటంతో ప్రస్తుతానికి డెల్టాక్రాన్‌గా పేరుపెట్టారు. ఇంకా శాస్త్రీయంగా పేరుపెట్టాల్సి ఉంది. అయితే కొత్త రకం వేరియంట్‌ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. మరోవైపు డెల్టాక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని మరికొందరు అంటున్నారు. సైప్రస్‌లో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్లకు సంబంధించిన 10 మ్యూటేషన్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

 

Tags :