MKOne TeluguTimes-Youtube-Channel

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మారియన్ విలియమ్‌సన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మారియన్ విలియమ్‌సన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆయన సొంత డెమొక్రటిక్‌ పార్టీ నుంచే తొలి సవాల్‌ ఎదురుకానుంది. ప్రముఖ రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త, డెమొక్రటిక్‌ పార్టీ నాయకురాలు మారియన్‌ విలియమ్‌సన్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. వాషింగ్టన్‌లో ఆమె తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికలకూ మారియన్‌ తొలుత బరిలోకి దిగి ఆ తర్వాత వైదొలగారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మళ్లీ పోటీ చేసే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బహుశా ఏప్రిల్లో ఆ దిశగా ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే అదే పార్టీ నుంచి మారియన్‌ రంగంలోకి దిగటంతో తొలుత డెమొక్రాట్లలోనే అధికారిక అభ్యర్థి ఖరారు కోసం అంతర్గత ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

 

 

Tags :